Last Updated:
కైలాస్ మానససరోవర్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా నేపాల్‌లో ఒక్కసారిగా వరదలు విరుచుకుపడ్డాయి. సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన బృందంలోని 77 మంది యాత్రికులు గల్లంతైనట్లు సమాచారం.. వీరిలో 50 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఈ విపత్తు ఎలా జరిగింది?
నేపాల్‌లో ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో కైలాస్ మానససరోవర్ యాత్రకు వెళ్లిన ఈశా ఫౌండేషన్‌కు చెందిన పలువురు యాత్రికులు గల్లంతైనట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన యాత్రా బృందం కూడా ఈ వరదల్లో చిక్కుకోవడంతో ఆందోళన మరింత పెరిగింది. ప్రస్తుతం సద్గురు టిబెట్‌లోనే ఉన్నట్లు సమాచారం.













