Sri Saanvi: అనంతపురం బిడ్డకు బంపర్ ఛాన్స్.. ప్రధాని మోదీతో ముచ్చటించనున్న టీటీ స్టార్ శ్రీశాన్వి! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

Sri Saanvi: క్రీడా రంగంలో అంకితభావంతో ముందుకు సాగుతున్న యువ ప్రతిభలకు కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు లభిస్తోంది. దేశవ్యాప్తంగా క్రీడా ప్రతిభను వెలికితీసేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

News18
News18

తాజాగా టేబుల్ టెన్నిస్ (TT) క్రీడలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ తారజువ్వలా దూసుకెళ్తున్న అనంతపురం జిల్లాకు చెందిన యువ క్రీడాకారిణి శ్రీశాన్వికి ఒక అరుదైన గౌరవం దక్కింది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా సంవాద్’ కార్యక్రమంలో ఆమె నేరుగా దేశ ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports