Toxic Collections: ఇదేందయ్యా ఇది.. భారీ హైప్ ఉన్నా రెండో రోజే చిత్తు చిత్తయిందిగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

భారీ హైప్ నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన టాక్సిక్ సినిమాకు రెండో రోజే ఎదురుదెబ్బ తగిలింది. తొలి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి.

News18
News18

కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకున్న రాకింగ్ స్టార్ యశ్ నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను నమోదు చేస్తోంది. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఫస్ట్ డే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ, సినిమాకి వచ్చిన డివైడ్ టాక్, మిశ్రమ సమీక్షల ప్రభావం రెండో రోజు వసూళ్లపై స్పష్టంగా కనిపించింది. తొలి రోజు కేవలం మనదేశంలోనే రూ.101.10 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచిన ఈ సినిమా, రెండో రోజు మాత్రం దారుణంగా చతికిలపడింది. డే 2లో కేవలం రూ.37.65 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసింది. అంటే నిన్నటితో పోలిస్తే ఇండియా నెట్ కలెక్షన్లలో ఏకంగా 62.8 శాతం భారీ డ్రాప్ కనిపించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports