Last Updated:
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. ఆయన ఇక లేరనే విషాదకర వార్తను ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. ఆయన ఇక లేరనే విషాదకర వార్తను ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో అలరించిన ఆయన మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.














