Last Updated:
తండ్రి సమాధి కోసం కొడుకు వేసిన మాస్టర్ స్కెచ్.. అవాక్కైన పోలీసులు, హైదరాబాద్‌లో!
రద్దీగా ఉండే ప్రసిద్ధ రెస్టారెంట్.. కస్టమర్ల వాహనాలను భద్రంగా పార్క్ చేయడానికి వాలెట్ పార్కింగ్ సిబ్బంది.. కానీ వారి కళ్లు గప్పి ఓ దుండగుడు ఏకంగా కారునే ఎత్తుకెళ్లాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన ఓ పాత నేరస్థుడు తన తండ్రి సమాధిని దర్శించుకోవడానికి వినూత్న రీతిలో దొంగతనానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని అత్తాపూర్ పిస్తా హౌస్ వాలెట్ పార్కింగ్ నుంచి కారును దొంగిలించిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడిని చాకచక్యంగా అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.














