Last Updated:
ఆగస్టు 26న సంభవించిన భారీ వరదల విషాదం నుంచి బయటపడకముందే నేపాల్-చైనా సరిహద్దులో మరో ప్రమాద హెచ్చరిక వెలువడింది. నేపాల్‌లో ఏర్పడిన కొత్త బారియర్ సరస్సు ఇప్పటికే పొంగిపొర్లుతుండగా.. వచ్చే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరనుంది.
నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతాన్ని వరదలు, కొండచరియలు ఇంకా వెంటాడుతున్నాయి. ఆగస్టు 26న సంభవించిన విధ్వంసకర ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తుండగానే మరో ప్రమాద హెచ్చరిక వెలువడింది. నేపాల్‌లో తాజాగా ఏర్పడిన ఓ బారియర్ సరస్సు (Barrier Lake)లో నీటిమట్టం పెరిగి పొంగిపొర్లుతోంది. రాబోయే మూడు రోజుల్లో మరింత నీరు చేరనున్న నేపథ్యంలో సరస్సు తెగిపోయే ప్రమాదం ఉందని చైనా అధికారులు హెచ్చరించారు.














