Last Updated:
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలతో ఇప్పటికే భారీ ప్రాణనష్టం జరగ్గా.. ముప్పు ఇంకా తొలగిపోలేదని నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కొండచరియలు విరిగిపడటం, గ్లేసియర్ కరగడం వల్ల మరోసారి వరదలు వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, వరద ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో అస్థిరంగా ఉన్న లోయలు, పాక్షికంగా విరిగిపడిన హిమానీనదం (గ్లేసియర్) కారణంగా రాబోయే రోజుల్లో మరోసారి భారీ స్థాయి వరదలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ (ICIMOD) శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇప్పటికే వరదల ధాటికి లెండె నది లోయలో ఉన్న నిటారుగా ఉండే రాళ్లు, వాలు ప్రాంతాలు తీవ్రంగా కోతకు గురయ్యాయి.














