Last Updated:
తాజాగా ఓ యంగ్ హీరోయిన్ ప్రేక్షకులకు బోల్డ్ సవాల్ విసిరి ఆశ్చర్యపరిచింది. మా సినిమా మీకు నచ్చకపోతే అమీర్‌పేట్ సెంటర్లో గుండు కొట్టించుకుంటా అనేసింది.
టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో పలు చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు.. స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ తో పనిలేకుండా తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. సరిగ్గా ఇదే కోవలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్న మరో చిన్న సినిమా ‘సహ: లైఫ్ ఆఫ్ సంజు’ (Saha: Life of Sanju). సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, వంశీ నందిపాటి ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి మద్దతు తెలిపారు. అయితే, ఈ ఈవెంట్లో సహ మూవీ హీరోయిన్ శ్వేతా లక్ష్మన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.














