Last Updated:
తిరుమల శ్రీవారిని క్రికెటర్ వాషింగ్టన్ సుందర్, సంగీత దర్శకుడు కోటి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా.. ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది.
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్, సంగీత దర్శకుడు కోటి వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.













