Last Updated:
అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన మత గురువుల సదస్సులో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని, దేశంలో ముస్లింలు ఉండకూడదని భావించే వ్యక్తి అసలైన హిందువు కాదని స్పష్టం చేశారు.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శనివారం జరిగిన ‘ఒకే ప్రపంచం: ఒకే మానవత్వం’ మత గురువుల సదస్సులో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించారు. వివిధ మతాల మధ్య ఐక్యత, సామరస్యం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం సమాజంలో మతాలు కేవలం ఆచారాలకే పరిమితం అయ్యాయని, అయితే మతం అసలు ఉద్దేశం మనిషిని సత్యం వైపు నడిపించడమేనని ఆయన స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి ఆచారాలు కూడా అవసరమేనని పేర్కొన్నారు. మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని చాటిచెప్పే సంప్రదాయం ఉన్న సమాజంలో తాను పనిచేస్తున్నానని భగవత్ గర్వంగా చెప్పారు.














