ఉజ్బెకిస్తాన్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు మిర్జియోయెవ్! | | ACTPnews

News18


Last Updated:

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్ చేరుకున్నారు. తాష్కెంట్ విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు స్వయంగా స్వాగతం పలకగా, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా కీలక చర్చలు జరగనున్నాయి.

News18
News18

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉజ్బెకిస్తాన్‌ రాజధాని తాష్కెంట్‌ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు షవకత్ మిర్జియోయెవ్ స్వయంగా ప్రధానికి సాదరంగా ఘన స్వాగతం పలికారు. ఉజ్బెకిస్తాన్‌లో మోదీ పర్యటించడం ఇది నాలుగోసారి కావడం విశేషం. అధ్యక్షుడి ఆహ్వానం మేరకు రెండ్రోజుల పాటు సాగే ఈ అధికారిక పర్యటనలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు నేతలు ప్రతినిధుల స్థాయి చర్చలు జరపనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports