Last Updated:
తిరుపతిలో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. తిరుమల రెడ్డి నగర్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు.
తిరుపతి నగరంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెంచారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు వ్యభిచార కార్యకలాపాలు, ఇతర అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమల రెడ్డి నగర్‌లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు.














