Last Updated:
PM Modi Mann Ki Baat: ఆంధ్రప్రదేశ్ రైతు దేశ ప్రధానిని ఆకర్షించింది. సాంప్రదాయ పంటలు, వాణిజ్య పంటలు, మెరుగైన వంగడాలు, ఆర్గానిక్ సాగుతో మెరుగైన ప్రగతిని, అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు ఏపీ రైతులు. అయితే ఈవిషయంలో కడప జిల్లాకు చెందిన ఓ సాధారణ రైతు కర్ణ వరదారెడ్డి మాత్రం అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించి కొత్త తరహా సాగుపై దృష్టి పెట్టి అందులో విజయం సాధిస్తున్నారు.
PM Modi Mann Ki Baat: ఆంధ్రప్రదేశ్ రైతు దేశ ప్రధానిని ఆకర్షించింది. సాంప్రదాయ పంటలు, వాణిజ్య పంటలు, మెరుగైన వంగడాలు, ఆర్గానిక్ సాగుతో మెరుగైన ప్రగతిని, అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు ఏపీ రైతులు. అయితే ఈవిషయంలో కడప జిల్లాకు చెందిన ఓ సాధారణ రైతు కర్ణ వరదారెడ్డి మాత్రం అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించి కొత్త తరహా సాగుపై దృష్టి పెట్టి అందులో విజయం సాధిస్తున్నారు. అందుకే ఆయన ప్రస్తావనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ లో దేశ ప్రజల ముందుకు తెచ్చారు. ఇది దేశంలోని చాలా మందికి స్ఫూర్తిదాయకమని ప్రధాని కొనియాడారు. వినూత్నంగా ఆలోచించే రైతుగా వరదారెడ్డిని దేశ ప్రజలకు పరిచయం చేశారు.














