Last Updated:
UK GCSE: ప్రపంచ వేదికపై తెలుగు తేజం మరోసారి మెరిసింది. సాధారణంగా 16 ఏళ్ల వయసున్న సెకండరీ పాఠశాల విద్యార్థులు రాసే అత్యంత క్లిష్టమైన బ్రిటన్ విద్యా పరీక్షల్లో కేవలం ఏడేళ్ల తెలుగు సంతతి బాలుడు అద్భుత విజయం సాధించి అందరినీ విస్మయానికి గురిచేశాడు.
తెలుగు మూలాలున్న జివ్యాన్ రెడ్డి ధ్రువ కట్టా (Jivyan Reddy Dhruva Katta) యూకేలో నిర్వహించిన ప్రతిష్టాత్మక పియర్సన్ ఎడెక్సెల్ జీసీఎస్ఈ (GCSE – జనరల్ సర్టిఫికెట్ ఇన్ సెకండరీ ఎడ్యుకేషన్) హయ్యర్ మ్యాథమెటిక్స్ పరీక్షలో అత్యుత్తమ గ్రేడ్-8 (ఏ-గ్రేడ్ సమానం) సాధించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాడు.














