అయితే, సోషల్ మీడియాలో లీకైన తాజా సమాచారం ప్రకారం.. అగ్నిపరీక్షలో తన మాటతీరు, టాస్క్‌లు ఆడే విధానంతో నిర్వాహకులను మెప్పించిన ఝాన్సీ ఇప్పటికే బిగ్ బాస్ మెయిన్ హౌస్‌లోకి డైరెక్ట్ ఎంట్రీని కన్ఫర్మ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ఫిజికల్, మైండ్ గేమ్‌లలో తనదైన మార్క్ చూపిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న రోహిత్ నాయుడు ఎంట్రీ కూడా దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇక మిగిలిన స్థానాల కోసం చరణ్, మిథిలేష్, రాజకుమారి, అమన్ మసూద్, షాలినీ, అపూర్వ, రామకృష్ణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో నలుగురికి అదృష్టం వరించే అవకాశం ఉంది.













