Last Updated:
KVB Bank: నకిలీ, ఫోర్జరీ పత్రాలను అసలైనవిగా నమ్మించి బ్యాంకులకు భారీ ఎత్తున శఠగోపం పెడుతున్న ఆర్థిక నేరగాళ్ల బండారం హైదరాబాద్లో మరోసారి బట్టబయలైంది.
వ్యాపార విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ పేరుతో బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు పొంది, వాటిని తిరిగి చెల్లించకుండా తప్పించుకునేందుకు నకిలీ పత్రాలను రంగంలోకి దించిన ఓ వ్యాపార సంస్థ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన కరూర్ వైశ్య బ్యాంక్ (కేవీబీ) అబిడ్స్ శాఖను సుమారు రూ.61.57 కోట్ల మేర మోసగించిన వ్యవహారంలో ఐదుగురిపై నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.














