Railway Jobs: రైల్వే బోర్డు భారీ శుభవార్త.. 5165 RRB NTPC పోస్టులకు గ్రీన్ సిగ్నల్.. అర్హతలు, ఎంపిక విధానం వివరాలివే! | | ACTPnews

Railway Jobs: రైల్వే బోర్డు భారీ శుభవార్త.. 5165 RRB NTPC పోస్టులకు గ్రీన్ సిగ్నల్.. అర్హతలు, ఎంపిక విధానం వివరాలివే! |


RRB NTPC ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు, ఇతర అలవెన్సులు లభిస్తాయి. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులైన జూనియర్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ తదితర ఉద్యోగాలకు పే లెవల్ 2 కింద బేసిక్ పే రూ.19,900 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్‌కు పే లెవల్ 3 వర్తిస్తుంది. ఇక గ్రాడ్యుయేట్ పోస్టులైన గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ వంటి ఉద్యోగాలకు పే లెవల్ 5 కింద రూ.29,200, లెవల్ 6 కింద చీఫ్ కమర్షియల్ సూపర్‌వైజర్‌కి రూ.35,400 బేసిక్ పే ఉంటుంది. వీటితో పాటు కరువు భత్యం (డీఏ), ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) వంటి అదనపు ప్రయోజనాలు కలుపుకుంటే చేతికి మంచి జీతం అందుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం పారదర్శకంగా ఉంటుంది. రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ-1, సీబీటీ-2), అవసరమైన పోస్టులకు స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *