Last Updated:
Robot Attack: రోబోలు తిరగబడటాన్ని సినిమాల్లో చూస్తుంటాం. బయట అలా జరగదు. అందుకు తగిన విధంగా వాటి ప్రోగ్రామ్ ఉంటుంది. కానీ రష్యాలో ఆ రోబో తిరగబడటమే కాదు. కస్టమర్ ప్రాణం తీసేంత పని చేసింది. ఆ వీడియో వైరల్ అవ్వడమే కాదు.. నెటిజన్లు భయపడేలా చేస్తోంది.
రష్యాలోని సరాటోవ్ నగరంలో ఒక ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లో జరిగిన విచిత్రమైన సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వోల్గా స్టోర్ 64లో టెక్ కన్సల్టెంట్‌గా ఉన్న హ్యూమనాయిడ్ రోబో ‘స్యోమా’ (Syoma) ఒక కస్టమర్ తనను నెట్టివేసిన తర్వాత ఎదురుదాడికి దిగినట్లు కనిపించింది. ఈ సంఘటన సెప్టెంబర్ 2, 2026న CCTV కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. స్టోర్ సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని రోబోను నియంత్రించారు. ఎవరికీ గాయాలు కాలేదు. స్టోర్ ఈ వీడియోను తమ Instagram అకౌంట్ (@volgastore64)లో పోస్ట్ చేసి, రోబో “నియంత్రణ కోల్పోయింది” అని, “ఎమోషనల్ రీబూట్”కు పంపిస్తున్నామని కామెడీగా తెలిపింది.














