Last Updated:
భారతీయ టెలివిజన్ చరిత్రలో ‘బిగ్‌బాస్’ (Bigg Boss) క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పటివరకు ఒకెత్తయితే ఈ సారి మరో ఎత్తు అనేలా భారీ ప్లాన్ చేశారు నిర్వాహకులు. వివరాల్లోకి వెళితే..
భారతీయ టెలివిజన్ చరిత్రలో, ముఖ్యంగా రియాలిటీ షోల విభాగంలో ‘బిగ్‌బాస్’ (Bigg Boss) క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. హిందీలో మొదలైన ఈ రియాలిటీ షో క్రమంగా ప్రాంతీయ భాషల్లోకి విస్తరించి, కోట్లాది మంది ప్రేక్షకులను టీవీల ముందు, ఓటీటీల ముందు కట్టిపడేస్తోంది. సౌత్ ఇండియాలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో బిగ్‌బాస్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ చాలా సువిశాలమైనది. సాధారణంగా ఒక్కో భాషలో ఒక్కో సీజన్ వేర్వేరు సమయాల్లో ప్రారంభం కావడం ఆనవాయితీ. కానీ, ఈసారి వీక్షకులకు ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ.. దక్షిణాదిలోని నాలుగు ప్రధాన భాషల్లో బిగ్‌బాస్ సరికొత్త సీజన్లు ఒకేసారి అట్టహాసంగా ప్రారంభం కాబోతున్నాయి.














