Last Updated:
బెంగళూరు నగరంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఐటీసీ ఫ్లైఓవర్ సమీపంలో ఆటోలో వెళ్తున్న దంపతులను అడ్డగించిన ఆరుగురు దుండగులు, దోపిడీకి పాల్పడ్డారు. అనంతరం భర్త ఎదుటే భార్యపై లైంగిక దాడికి తెగబడటంతో నగరంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
సిలికాన్ సిటీ బెంగళూరులో మహిళల భద్రతను తీవ్రంగా ప్రశ్నించే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పులికేశి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రద్దీగా ఉండే ఐటీసీ ఫ్లైఓవర్ కింద ఒక మహిళపై ఆరుగురు గుర్తుతెలియని దుండగులు ఆమె భర్త ముందే అమానుషంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో దంపతులు తమ స్నేహితుల ఇంటికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ భయంకరమైన ఘటన జరిగింది. ఐదారుగురు ఆగంతకులు రెండు బైక్‌లపై వచ్చి ఆటోను అడ్డగించారు.














