Peddi Movie: ‘పెద్ది’ ట్రైలర్ రన్ టైమ్ లాక్.. రామ్ చరణ్ ఊచకోత ఎన్ని నిమిషాలంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

వచ్చే నెల 4న రిలీజ్ కాబోతున్న పెద్ది సినిమాపై మెల్లి మెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు. బుచ్చి బాబు మామ ఈ సారి పిచ్చెక్కిపోయే కాన్సెప్ట్‌తో వస్తున్నాడని మాత్రం ఓ క్లారిటీ వచ్చేసింది.

News18
News18

వచ్చే నెల 4న రిలీజ్ కాబోతున్న పెద్ది సినిమాపై మెల్లి మెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు. బుచ్చి బాబు మామ ఈ సారి పిచ్చెక్కిపోయే కాన్సెప్ట్‌తో వస్తున్నాడని మాత్రం ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 18న రిలీజ్ కాబోతుంది. దీని కోసం ముంబైలో ఓ గ్రాండ్ ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌‌కు సంబంధించిన రన్ టైమ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

‘పెద్ది’ సినిమా ట్రైలర్ 2 నిమిషాల 35 సెకండ్ల నిడివితో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ట్రైలర్ దెబ్బతో ఇప్పటి వరకు సినిమాపై ఉన్న అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోతాయట. నిజానికి ఈ సినిమా రిలీజ్ కోసం ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, పాటలు గట్రా సినిమా లవర్స్‌లో మాములు ఎగ్‌జైట్‌మెంట్ క్రియేట్ చేయలేదు.

అసలు పెద్ది ఫస్ట్ షాట్ రిలీజ్ తర్వాత మెగా ఫ్యాన్స్ మనసు మనసులో లేదంటే నమ్ము. అప్పటికే గేమ్ ఛేంజర్ చేసిన గాయాన్ని ఎలా మరిచిపోవాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్న చెర్రీ ఫ్యాన్స్‌కు పెద్ది ఫస్ట్ షాట్ ఒక రేంజ్ హై ఇచ్చింది. ఆ తర్వాత నుంచి వరుసగా చికిరీ చికిరీ, రై రై రారా పాటలు అమాంతం అంచనాలు పెంచేశాయి. అసలు ఆ రెండు పాటలు వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లు అనిపిస్తుంది. అంత టెర్రిఫిక్‌గా రెహమాన్ ట్యూన్స్ కంపోజ్ చేశాడు.

ఇంకెక్కడి రెహమాన్‌రా బాబూ.. ఆయన సంగీతానికి కాలం చెల్లిందంటూ వస్తున్న విమర్శలకు పెద్ది పాటలతో నోళ్ళు లాక్ చేసుకునేలా చేశాడు. ఇక ఈ సినిమా జూన్ 4న రిలీజ్ కాబోతుంది. మరోవైపు ఈ సినిమాకు ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతుందట. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా, అన్ని భాషలకు కలిపి రూ.120 కోట్ల డీల్‌ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక శాటిలైట్ రైట్స్ కూడా రూ.70 కోట్ల వరకు వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉందట. ఇక ఆడియో రైట్స్ రూపంలో ఆల్రెడీ రూ.35 కోట్లు ఆల్రెడీ వచ్చేశాయి. ఇలా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమాకు రూ.225 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది.

ఇక థియేట్రికల్ రైట్స్ పరంగా ఈ సినిమాకు అక్షరాల రూ.300 కోట్ల బిజినెస్ జరుగుతుందని టాలీవుడ్ ట్రేడ్ అంచనా వేస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్‌ నుంచి రూ.40 కోట్ల డీల్ కంప్లీట్ అయిపోయింది. కర్ణాటక నుంచి రూ.23 కోట్ల డీల్ క్లోజ్ చేసుకుని అగ్రిమెంట్ కూడా జరిగిపోయిందట. ఇక నైజాంలో ఈ సినిమాకు రూ.65 కోట్ల వరకు డీల్ క్లోజ్ చేసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సీడెడ్ రూ.35 కోట్లు, కోస్టల్ ఆంధ్ర రూ.85 కోట్ల వరకు రేటును పలికే ఛాన్స్ ఉందట. హిందీ మార్కెట్‌లో కూడా పెద్దిపై బీభత్సమైన హైప్ క్రియేట్ అయింది. ఇలా మొత్తంగా చూసుకుంటే రూ.300 కోట్ల మార్క్ టచ్ చేసేలానే కనిపిస్తుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *