BRS MLC Tata Madhu Arrested By Task Force: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్! | ACTPnews

BRS MLC Tata Madhu Arrested By Task Force:  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్!



శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధును హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. హైదర్గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నివాసం వద్ద పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిన్న అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ నేతలపై జరిగిన పోలీసుల దాడి క్రమంలో ఈ ఘటన జరగ్గా, స్పీకర్ సీటుపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, తమపై దాడి చేసిన పోలీసుల దుస్తులు, ప్రవర్తనపైనే మాట్లాడానని తాతా మధు వివరణ ఇచ్చారు. కాగా, పోలీసుల అరెస్ట్ చర్యను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed