Komatireddy Rajagopal Reddy: నాకు మంత్రి పదవి కన్ఫామ్ అంటూ ప్రచారం.. కోమటిరెడ్డి బ్రదర్‌కి ఏ రూట్‌లో క్యాబినెట్‌లో చోటు | తెలంగాణ వార్తలు | ACTPnews

Komatireddy Rajagopal Reddy


Last Updated:

Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి పాలమూరు జిల్లా నేతపైనే వేటు పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత తనకు మంత్రి పదవి కన్ఫామ్ అయిందని ప్రచారం చేసుకుంటున్నట్లుగా కూడా వినిపిస్తోంది.

Komatireddy Rajagopal Reddy
Komatireddy Rajagopal Reddy

Telangana Cabinet Expansion: రాజకీయాలు ఓ వైకుంఠపాళి ఆట లాంటిది. ఇందులో ఎప్పుడు ఎవరు నిచ్చెన ఎక్కి పైకి వెళ్తారో.. ఎవరు పాము మింగి కిందకు పడిపోతారో ఊహించలేం. అందుకే రాజకీయాల్లో ఉండే వ్యక్తులు మరీ ముఖ్యంగా మంత్రి పదవులు అనుభవించే వారు, పదవులు కావాలని ఆశ పడేవారు తీరు సవ్యంగా ఉంచుకోవడం ముఖ్యమని తెలంగాణ క్యాబినెట్ నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. అయితే తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో భాగంగా కొత్త ముఖాలు మంత్రివర్గంలోకి రానున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఎప్పటి నుంచో మినిస్టర్ సార్ అనిపించుకోవాలనుకుంటున్న కోమటిరెడ్డి బ్రదర్ రాజగోపాల్ రెడ్డి కల నెరవేరబోతున్నట్లుగా ఆయన సొంత వర్గం నుంచే ప్రచారం జరుగుతోంది. మరి ఆయనికి కుర్చి ఇవ్వాలంటే ఎవరి కుర్చికి ఎసరు పడబోతోంది అనే చర్చ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు కంటే ముందుగా ప్రొఫెసర్ కోదండరామ్, విజయశాంతి, మహేశ్ కుమార్ గౌడ్ పేర్లు వినిపిస్తుండగా కొత్తగా నాకు మంత్రి పదవి కన్ఫామ్ అయింది..! ఫలానా శాఖ ఇవ్వమని అడుగుదామనుకుంటున్నా అని స్వయంగా రాజగోపాల్ రెడ్డి అత్మీయులకు ఫోన్ చేసి చెప్పినట్లుగా సమాచారం. ఏ క్యాటగిరిలో ఆయనకు మంత్రి పదవి ఇస్తారనే అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed