BRICS 2026: న్యూఢిల్లీ చేరుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. నేడు ప్రధాని మోదీతో కీలక భేటీ! | | ACTPnews

PC: X.com


Last Updated:

BRICS 2026: భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శనివారం ఉదయం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు.

PC: X.com
PC: X.com

ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. 2019లో తమిళనాడులోని మామల్లపురంలో జరిగిన రెండో అనధికారిక సదస్సు తర్వాత షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. వాస్తవాధీన రేఖ (LAC) వెంట గత కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతల అనంతరం, ఇరు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు సాగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. షీ జిన్‌పింగ్‌తో పాటు చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కై కీ, విదేశాంగ మంత్రి వాంగ్ యీ సహా పలువురు ఉన్నతాధికారులు ఢిల్లీకి వచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports