Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. మైనర్ బాలికపై సామూహిక లైంగికదాడి.. 9 మందిపై పోక్సో కేసు! | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Hyderabad: మాయమాటలతో వలవేసి, మత్తుమందు అలవాటు చేసి ఓ ఇంటర్ విద్యార్థినిపై వరుసగా పలువురు లైంగికదాడికి పాల్పడిన అత్యంత హేయమైన ఘటన నగరంలో కలకలం రేపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన 9 మంది నిందితులపై అల్వాల్ పోలీసులు పోక్సో (POCSO) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు పదో తరగతి చదువుతున్న సమయంలో జెర్రీ వరుణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్ది నెలల క్రితం అతడు చాక్లెట్లలో మత్తుమందు కలిపి ఇచ్చి, తన కారులోనే బాలికపై మొదటిసారి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత జెర్రీ వరుణ్ ద్వారా రొమల వరుణ్ అనే మరో యువకుడు పరిచయమయ్యాడు. అతడు ఆ బాలికకు మద్యం, సిగరెట్లు, గంజాయి వంటి వ్యసనాలను అలవాటు చేసి కొంపల్లి ప్రాంతంలో లైంగికదాడి చేశాడు. అంతకుముందే డేవిడ్ వరుణ్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై, మద్యం తాగించి ఆమెపై అసభ్యంగా ప్రవర్తించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed