Last Updated:
Rain Alert: వినాయక చవితి పర్వదినం వేళ తెలంగాణ వ్యాప్తంగా వరుణదేవుడు కరుణించాడు. గత రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
గత కొద్ది రోజులుగా వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులకు ఈ వానలు ఊరటనిచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలు తడిసిముద్దయ్యాయి. వ్యవసాయ పనులకు ఈ వర్షం ప్రాణం పోసినట్లయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నగరవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచికొడుతోంది.














