Atishi :మోదీకి రాఘవ్ భయపడ్డాడు..బీజేపీలో చేరుతాడు..అతిశీ సంచలన ఆరోపణలు! | ACTPnews

Atishi  :మోదీకి రాఘవ్ భయపడ్డాడు..బీజేపీలో చేరుతాడు..అతిశీ సంచలన ఆరోపణలు!



ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వ్యవహారశైలిపై ఢిల్లీ అసెంబ్లీ విపక్ష నేత అతిశీ మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడులు జరుగుతున్నా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల అవకతవకలపై విపక్షాలు గళమెత్తుతున్నా రాఘవ్ చద్దా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఆయన భయపడుతున్నారా? అని నిలదీశారు. గతంలో ఇతర విపక్ష నేతలు ED, CBI కేసులకు భయపడి బిజెపిలో చేరినట్లుగానే, చద్దా కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే బిజెపిని ప్రశ్నించడం లేదని అతిశీ ఆరోపించారు. ఎల్పీజీ ధరల పెరుగుదల, గుజరాత్ ఆప్ కార్యకర్తల అరెస్టులపై ఆయన స్పందించకపోవడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటని ఆమె నిలదీశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports