మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కోస్తా జిల్లాలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతిలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చని సూచించింది. పిడుగులు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదు.పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచనలు చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.














