Donald Trump: అదంతా ఒక పెద్ద బూటకం.. ఏఐపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! | | ACTPnews

News18


Last Updated:

Donald Trump: కృత్రిమ మేధ (AI) మానవాళి ఉనికికే ముప్పు తెస్తుందనే ఆందోళనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా కొట్టిపారేశారు.

ట్రంప్ (ఫైల్ ఫోటో)
ట్రంప్ (ఫైల్ ఫోటో)

అదంతా కేవలం ఒక “బూటకం” (Hoax) అని ఆయన కొట్టిపారేస్తూ, శరవేగంగా విస్తరిస్తున్న ఈ సరికొత్త సాంకేతికతపై కఠిన నియంత్రణలు విధించాలనే ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఏఐ వల్ల తీవ్ర ముప్పు పొంచి ఉందని, అభివృద్ధి వేగాన్ని కాస్త తగ్గించాలని పలువురు ప్రముఖ టెక్ దిగ్గజాలు హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేసిన ట్రంప్.. “ఏఐ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటుందని, మానవాళిని నాశనం చేస్తుందని వస్తున్న కథనాలన్నీ పెద్ద అబద్ధాలు” అని పేర్కొన్నారు. గతంలో తనపై వచ్చిన రష్యా విచారణ, ఉక్రెయిన్ వ్యవహారంలో జరిగిన అభిశంసనల మాదిరిగానే ఇది కూడా ఒక రాజకీయ కుట్ర అని పోల్చారు. వినాశనకారులు, వక్రబుద్ధి గల శక్తులు అమెరికాను తప్పుదోవ పట్టించడానికి ఆడుతున్న మరో నాటకమని ఆయన విమర్శించారు. అంతేకాకుండా, చమురు, బంగారం, వజ్రాలు లేదా చివరకు ఇంటర్నెట్ కంటే కూడా ఏఐ, డేటా సెంటర్లు మానవ చరిత్రలోనే “అత్యుత్తమ ఆర్థిక చోదక శక్తి” (Greatest Economic Development Engine)గా మారబోతున్నాయని ట్రంప్ జోస్యం చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *