బ్రహ్మోత్సవాల్లో భక్తుల సేవలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ భక్తుల అవసరాలను గుర్తించి సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు. భక్తుల సేవనే స్వామివారి సేవగా భావించి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములు కావాలని సూచించారు. సేవకులు అందించే సేవల ద్వారా శ్రీవారి వైభవం మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా పనిచేయాలని టీటీడీ చైర్మన్, అధికారులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, శ్రీవారి సేవ ఇన్చార్జ్, టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి.రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.














