చంద్రహాస్ చేతుల మీదుగా ముగ్గురు కోతులు ‘చిల్లర సాంగ్’ రిలీజ్.. ఎటు పోతోందిరా మావ ట్రెండ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. తాజాగా ఈ సినిమా నుంచి ‘చిల్లర సాంగ్’ రిలీజ్ చేశారు.

News18
News18

జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, ‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ ఇలా వరుసగా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్‌లో మంచి ఆసక్తిని క్రియేట్ చేశాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభించింది.

తాజాగా ఈ చిత్రంలోని ‘చిల్లర సాంగ్’*ను యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ముగ్గురు కోతులు’ చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘చిల్లర సాంగ్’ అంటూ సాగే ఈ పాటకు ఎస్. సుహాస్ అందించిన సాహిత్యం, గాత్రం, బాణీ ఎంతో క్యాచీగా ఉన్నాయి. గణేష్ బొడ్డ, సుహాస్ ఎస్ సంయుక్తంగా రాసిన ఈ పాటలో ముగ్గురు హీరోలు సరదాగా చిల్ అవుతున్న సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఎస్. సుహాస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రాజ్ నోముల కెమెరామెన్‌గా, జమీర్ షేక్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మున్ముందు మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ సినిమాలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed