Last Updated:
ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి మధుసుదన్ రావు, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో రాబోతున్న కొత్త సినిమా ఫీల్ మై లవ్. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం ‘ఫీల్ మై లవ్’. ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి మధుసుదన్ రావు, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి హరి ప్రకాష్ ఎం రచన, దర్శకత్వం వహించారు. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, యూత్‌కి నచ్చే కంటెంట్‌తో ఈ మూవీ రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా వినాయక చవితి సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ స్పెషల్ పోస్టర్లో సినిమాలోని ప్రధాన పాత్రలన్నింటినీ చూపించారు. ఇక త్వరలోనే ఆడియో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఆపై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రమోషనల్ ఈవెంట్లను నిర్వహించబోతోన్నారు. చెన్నై, పుదుచ్చేరి, మున్నార్, కొడైకెనాల్లోని అద్భుతమైన లొకేషన్లలో తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణ కానున్నాయి.
ఎం.ఎస్. సతీష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రాజరవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జి ద్వయం ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా పని చేస్తున్నారు. అజయ్ మనోజ్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది. త్వరలోనే సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి,మధుసుదన్ రావు, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. రాజా రవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జి సంగీతం అందిస్తున్నారు.














