Last Updated:
KTR vs REVANTHREDDY: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ..ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన కొత్త భూమి చట్టం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KTR vs REVANTHREDDY: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ..ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన కొత్త భూమి చట్టం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేవలం లక్షల కోట్ల రూపాయల భూదోపిడికి పాల్పడేందుకే ధరణిని మూసివేసి భూభారతిని తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్. గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ వెయ్యి ఎకరాలు అని తప్పుడు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి నిన్నటి అసెంబ్లీలో వందల ఎకరాలు అని లెక్కలతో సహా చెప్పడం చూస్తే వాళ్ల నిజాయితీ ఎంటో తెలిసిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు ప్రచారానికి కేసీఆర్‌కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక పొంగులేటి కొడుకుకి చెందిన భూములను డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ ఫామ్ హౌస్ భూమి పేరుతో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. అంతే కాదు గోడలపై రాతలు రాసుకునే రేవంత్ రెడ్డికి జూబ్లిబిల్స్లో ప్యాలెస్ ఎలా వచ్చిందో చెప్పాలని వ్యక్తిగత విమర్శలకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై బురద చల్లి తప్పించుకోవాలని చూస్తోందని అయినా 22ఏ పై వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రంలో భూమి చట్టాలు, భూకేటాయింపుల విషయంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య గట్టి వార్ జరుగుతోంది. ఈవిషయంలో బుధవారం అసెంబ్లీలో 22ఏ పై జరిగిన చర్చలో కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయని..? ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి తప్పుడు పత్రాలు సృష్టించుకున్నారని అందుకోసమే ధరణిని వాడుకున్నారని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీటుగా బదులిచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తన తండ్రి భూస్వామి అని ఆయనకు వందల ఎకరాలు ఉండకూడదా అని ప్రశ్నించారు. తాను అమెరికాలో చదువుకొని, ఉద్యోగం చేసిన డబ్బుతో భూములు కొనుక్కుంటే రేవంత్ రెడ్డి అవన్నీ అక్రమంగా రాయించుకున్న భూములని చెప్పడంపై సెటైర్ వేశారు. గోడలపై రాతలు రాసుకున్న నీకు జూబ్లిహిల్స్ లో ప్యాలెస్, నీ తమ్ముళ్లకు ఏరో స్పెస్ కంపెనీలు ఎలా వచ్చాయో చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బాబాయి ఎందుకు చనిపోయాడో చెప్పాలని కేటీఆర్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ లెక్కలు తేలుస్తానంటూ విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డికి కేటీఆర్ మరికొన్ని విమర్శలు చేశారు. తన తండ్రి ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తి, భూముల వివరాలను పొందుపర్చారని చెప్పారు. వాటిని ఒకసారి చూసుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కేవలం డిగ్రీ మాత్రమే చదివిన రేవంత్ రెడ్డికి ఇన్నీ వేల ఎకరాల భూమి, ఆస్తులు, కుటుంబ సభ్యుల పేరుతో కంపెనీలు ఎలా వచ్చాయో చెప్పగలరా అంటూ ప్రతిదాడికి దిగారు కేటీఆర్. తమ పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఇక సీఎం ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టకూడదని కేటీఆర్ ప్రశ్నించారు. అలాంటప్పుడు సీఎంకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా.. సామాన్యులకు ప్రత్యేక చట్టం ఉంటుందా అని నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
బుధవారం రేవంత్ రెడ్డి 22A పై చర్చ అంటూ బీఆర్ఎస్ నేతలపై చేసిన భూ ఆరోపణలు చేసి విషయాన్ని తప్పుదారి పట్టించారని అన్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే భూ వివాదంపై సమగ్ర చర్చ జరపడానికి నెల రోజులు అసెంబ్లీని నిర్వహించాలన్నారు. తమపై ఉన్న సస్పెన్షన్‌ని ఎత్తివేస్తే బీఆర్ఎస్ సభ్యులంతా సమావేశాలకు హాజరవుతామని.. రేవంత్ రెడ్డి ఆరోపణలు, విమర్శలకు తగిన కౌంటర్ ఇస్తామని కేటీఆర్ బదులిచ్చారు.














