ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. పంత్‌కు దక్కని చోటు | క్రీడా వార్తలు | ACTPnews

ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. పంత్‌కు దక్కని చోటు | క్రీడా వార్తలు


ఈసారి జట్టులో యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయడం విశేషం. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు వన్డే జట్టులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యలకు చోటు దక్కినా.. వారి ఎంపిక ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు స్పష్టం చేశారు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. మహ్మద్ షమి విషయంపై సెలక్షన్ కమిటీ చర్చించలేదని తెలిపారు. ఈ సిరీస్‌లో యువ క్రికెటర్లకు భారీ అవకాశం దక్కింది. హర్ష్ దూబె, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ తొలిసారిగా భారత జట్టులో స్థానం సంపాదించారు. ముఖ్యంగా ప్రిన్స్ యాదవ్ వన్డే జట్టులోనే చోటు దక్కించుకోవడం ఆసక్తికరంగా మారింది.

టెస్టు జట్టుకు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవ్‌దత్ పడిక్కల్ వంటి యువ ఆటగాళ్లతో జట్టు బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్ కీలక బాధ్యతలు తీసుకోనున్నారు.

వన్డే జట్టులో మాత్రం అనుభవం-యువత కలయిక కనిపిస్తోంది. కెప్టెన్‌గా మళ్లీ శుభ్‌మన్ గిల్‌కే బాధ్యతలు అప్పగించగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ బ్యాటర్లు జట్టుకు బలం కానున్నారు. ఇషాన్ కిషన్ తిరిగి వన్డే సెటప్‌లో చోటు సంపాదించగా.. అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి పేసర్లు అఫ్గాన్ బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు.

అఫ్గాన్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టు..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవ్‌దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్, హర్ష్ దూబె.

మూడు వన్డేల కోసం టీమ్‌ఇండియా..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ*, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య*, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబె.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *