Laddu Challenge: 30 నిమిషాల్లో 28 లడ్డూలు తిన్నాడు.. రూ.2 వేల కోసం కడుపుని మిఠాయి దుకాణంగా మార్చాడు | ట్రెండింగ్ | ACTPnews

Laddu Challenge


Last Updated:

Ladoo Challenge: తినే పోటీలు ఎక్కడ పెట్టినా అందరూ విచిత్రంగా స్పందిస్తారు. అక్కడ గెలిచిన వ్యక్తిని గొప్పగా కొందరు చూస్తుంటే మరికొందరు నేనైతే ఇంకా ఎక్కువ తిని ప్రైజ్ మనీ గెలిచే వాడిని అంటుంటారు. గుజరాత్‌లో ప్రతీ సంవత్సరం తర్ణేతర్ జాతర జరుగుతుంది.

Laddu Challenge
Laddu Challenge

Ladoo Challenge: తినే పోటీలు ఎక్కడ పెట్టినా అందరూ విచిత్రంగా స్పందిస్తారు. అక్కడ గెలిచిన వ్యక్తిని గొప్పగా కొందరు చూస్తుంటే మరికొందరు నేనైతే ఇంకా ఎక్కువ తిని ప్రైజ్ మనీ గెలిచే వాడిని అంటుంటారు. గుజరాత్‌లో ప్రతీ సంవత్సరం తర్ణేతర్ జాతర జరుగుతుంది. ఇక్కడ గుజరాత్ క్రీడలు, యువజన, సాంస్కృతిక వ్యవహారాల శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గుజరాత్, జిల్లా శిక్షణా కేంద్రం కలిసి లడ్డూలు తినే పోటీ నిర్వహించింది. ఇందులో 25 సంవత్సరాల నుంచి 75 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తులు పోటీ పడ్డారు. అందులో సురేంద్రనగర్‌కు చెందిన బల్వంతభాయ్ రఘ్వానీ అనే వ్యక్తి కేవలం 30 నిమిషాల్లో 28 లడ్డూలను తినేసి పోటీలో విజేతగా నిలిచాడు. అంటే సుమారు రెండు కిలోల స్వీట్‌ని అరగంటలో ఊదేశాడన్నమాట. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

జాతరలో తిండి పోటీలు..

కొన్ని పోటీలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరికొన్ని పోటీలు అద్భుతంగా అనిపిస్తాయి. మరి గుజరాత్‌లో నిర్వహించిన లడ్డూలు తినే పోటీ మాత్రం ఔరా అనిపిస్తోంది. ప్రతీ సంవత్సరం ప్రఖ్యాత తర్ణేతర్ జాతరలో భాగంగా పలు పోటీలు నిర్వహిస్తారు. ఈసారి కూడా అలాగే లడ్డూలు తినే పోటీ పెట్టారు. ఈ పోటీలో ఈసారి 25 నుంచి 75 ఏళ్ల మధ్య వయసు గల 28 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే సురేంద్రనగర్‌కు చెందిన బల్వంతభాయ్ రఘ్వానీ కేవలం 30 నిమిషాల వ్యవధిలో ఏకంగా 28 లడ్డూలు తిని అక్కడి వాళ్లను ఆశ్చర్యపరిచాడు. ఈ పోటీలో విజేతగా నిలిచి ప్రైజ్ మనీ రూ.2వేలు గెలుచుకున్నాడు. విచిత్రం ఏమిటంటే ఈ విధంగా లడ్డూలు తినే పోటీలో బల్వంతభాయ్ రఘ్వానీ గెలవడం ఇది రెండో సారి.

స్పోర్ట్స్ ఒలింపిక్ తరహాలో పోటీలు..

గుజరాత్ యూత్, స్పోర్ట్స్ అథారిటీ, సంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. గ్రామీణ ఒలింపిక్స్‌ తరహాలో ఈ లడ్డూలు తినే పోటీని ఏర్పాటు చేశారు. సుమారు 28 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీ ప్రారంభమైన తొలి 15 నిమిషాల్లోనే పలువురు సుమారు 15 లడ్డూలు తిని పోటీ నుంచి తప్పుకున్నారు. చివరి వరకు కేవలం ఐదుగురు మాత్రమే లడ్డూల అంతు చూడటానికి .. ప్రైజ్ మనీ గెలవడానికి కంకణం కట్టుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో ఒక్కొక్కరు 22, 24, 26 లడ్డూలు తిని చేతులు ఎత్తేశారు.

28 లడ్డూలు తిన్న విజేత..

ఐదుగురిలో బల్వంతభాయ్ రఘ్వానీ అనే వ్యక్తి 28 లడ్డూలు తిని ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాడు. విజేతగా నిలిచిన అతనికి రూ. 2,000 నగదు బహుమతిని అందజేశారు జాతర నిర్వాహకులు. ఈ పోటీ సందర్భంగా ప్రేక్షకుల నుంచి లభించిన మద్దతు పోటీదారులలో మరింత ఆనందాన్ని నింపిందని జిల్లా కలెక్టర్ జి.హెచ్. సోలంకి పేర్కొన్నారు. ఈ తరహా పోటీలు జాలావార్ ప్రాంతపు జానపద సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఇప్పుడు ఈ వార్త, వీడియోలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. రెండు వేల కోసం చూసుకుంటే షుగర్ వస్తుందని కొందరు.. ఇంకో లడ్డూ కావాలా బాబు అంటూ సరదా కామెంట్స్ షేర్ చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed