‘ఆసియా క్రీడల్లో సత్తా చాటండి’.. భారత అథ్లెట్లకు నీతా అంబానీ ఆత్మీయ సందేశం! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. దేశం గర్వపడేలా ధైర్యంతో, ఆనందంగా పోరాడాలని భారత క్రీడా బృందానికి ఆమె ఆత్మీయ సందేశం ఇచ్చారు.

News18
News18

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో (2026 ఆసియా గేమ్స్) పతకాల వేటలో ఉన్న భారత క్రీడాకారుల్లో సరికొత్త ఉత్సాహం నింపేలా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ ఒక ఆత్మీయ సందేశం ఇచ్చారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద క్రీడా వేదికపై అడుగుపెడుతున్న ప్రతి అథ్లెట్.. మొత్తం దేశ ప్రజల ఆశలు, కోట్లాది మంది అభిమానుల ఆశీస్సులను తమ వెంట తీసుకెళ్తున్నారనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. “మైదానంలోకి దిగాక ఎంతో ధైర్యంతో, అంతులేని ఆనందంతో పోటీ పడండి.

ఒక అద్భుతమైన అవకాశం ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. క్రీడల్లో మీరు కనబరిచే అత్యుత్తమ ప్రదర్శన ఎందరిలోనో కొత్త కలలను రేకెత్తిస్తుంది. ఒక అథ్లెట్ ఏకంగా ఒక తరానికే ఆదర్శంగా నిలుస్తాడు. ఇది మీ సమయం. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. పతకాలు సాధించి దేశం గర్వపడేలా చేయండి. యావత్ దేశం మీ వెంటే ఉండి ప్రోత్సహిస్తోంది” అని నీతా అంబానీ భారత బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందానికి రిలయన్స్ ఫౌండేషన్ అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. మైదానంలో మాత్రమే కాకుండా బయట కూడా క్రీడాకారులకు పూర్తి మద్దతు అందిస్తోంది. తొమ్మిది వేర్వేరు క్రీడలకు చెందిన మొత్తం 48 మంది అథ్లెట్లకు ఫౌండేషన్ ఆర్థికంగా అండగా నిలుస్తోంది. వీరిలో ప్రముఖ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్, హై జంపర్ తేజస్విన్ శంకర్, లాంగ్ జంపర్ శ్రీశంకర్ మురళీ, బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి లాంటి అగ్రశ్రేణి క్రీడాకారులు ఉన్నారు.

క్రీడాకారులకు ఎప్పటికప్పుడు వైద్య సాయం అందించేందుకు సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి చెందిన స్పోర్ట్స్ మెడిసిన్ టీమ్, ఫిజియోథెరపిస్టులు కూడా భారత బృందంతో పాటు జపాన్ వెళ్లారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో 2.9 కోట్ల మందికి పైగా చిన్నారులకు క్రీడల్లో అద్భుత అవకాశాలు కల్పిస్తున్నట్లు ఫౌండేషన్ వెల్లడించింది. ప్రతి ఛాంపియన్ ఒకప్పుడు ఆడేందుకు అవకాశం దొరికిన చిన్న పిల్లాడేనని, గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులను వెలికితీసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని సంస్థ స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed