IND W vs BAN W: షఫాలీ వర్మ సెంచరీ.. బంగ్లాదేశ్‌పై టీమిండియా సూపర్ విక్టరీ.. ఫైనల్లో ఎంట్రీ | క్రీడా వార్తలు | ACTPnews

PC: BCCI Women


Last Updated:

IND W vs BAN W, Asian Games 2026: ఆసియా కప్ 2026 (Asia Cup 2026)లో ఛాంపియన్‌గా నిలిచిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు ఆసియా గేమ్స్ 2026 (Asian Games 2026)లో కూడా అదరగొడుతోంది.

PC: BCCI Women
PC: BCCI Women

ఆసియా గేమ్స్‌లో భారత జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ మహిళల జట్టుపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (49 బంతుల్లో 100 నాటౌట్; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కింది. స్మృతి మంధాన (25 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 40; 6 ఫోర్లు) రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో నందని శర్మ, దీప్తి శర్మలు చెరో 3 వికెట్లతో రాణించారు. ఫైనల్లో భారత జట్టు శ్రీలంకతో తలపడనుంది. రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై శ్రీలంక నెగ్గి ఫైనల్ చేరింది.

81 పరుగులకే కుప్పకూలిన బంగ్లా

196 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మహిళల జట్టు భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ నిలబడలేకపోయింది. 15.4 ఓవర్లలో కేవలం 81 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో దిలారా అక్తర్ (23 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్), సుల్తానా ఖతూన్ (8 బంతుల్లో 12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ (3 వికెట్లు), నందని శర్మ (3 వికెట్లు) ప్రత్యర్థి నడ్డి విరవగా, శ్రీ చరణి 2 వికెట్లు, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ పడగొట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports