Last Updated:
అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన సినిమా ‘డియర్ ఆస్ట్రోనాట్’. యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్యరాజా సమర్పణలో కార్తీక్ భాగ్యరాజా రచన, దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి కీలకమైన అప్‌డేట్ వచ్చింది.
అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన సినిమా ‘డియర్ ఆస్ట్రోనాట్’. యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్యరాజా సమర్పణలో కార్తీక్ భాగ్యరాజా రచన, దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి కీలకమైన అప్‌డేట్ వచ్చింది. ఇందులో డేవిడ్ థామస్ అనే ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్న ప్రముఖ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
పోస్టర్‌ను పరిశీలిస్తే గౌతమ్ వాసుదేవ్ మీనన్ గతంలో కనిపించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. డేవిడ్ థామస్ పాత్రకు ప్రత్యేకమైన లుక్‌ను డిజైన్ చేశారు. సినిమాలో ఆయన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని, కథను ముందుకు తీసుకెళ్లే కీలకమైన పాత్రల్లో ఇదొకటని మేకర్స్ చెబుతున్నారు.
‘డియర్ ఆస్ట్రోనాట్’ కథ విషయానికి వస్తే.. చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య విహరించాలని కలలు కనే ఓ యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో ఆమె చేసే ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు, అడ్డంకులు, భావోద్వేగాలు, పట్టుదలను సినిమాలో చూపించబోతున్నారు. సాధారణ కమర్షియల్ కథకు భిన్నంగా ఒక యువతి అసాధారణమైన కలను సాకారం చేసుకునే ప్రయాణాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఇక సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అక్టోబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్‌కు ముందు సినిమాలోని పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేసేందుకు ‘క్యారెక్టర్ రివీల్ వీక్’ను కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగానే తొలి అప్‌డేట్‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ను డేవిడ్ థామస్‌గా పరిచయం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని పాత్రలు, ఫస్ట్ లుక్ పోస్టర్లు, సినిమా కథా ప్రపంచానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్లు విడుదల కానున్నాయి.
‘డియర్ ఆస్ట్రోనాట్’ చిత్రానికి కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్యరాజా బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తీక్ భాగ్యరాజా రచన, దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్‌లో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు:గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు
టెక్నికల్ టీం:
బ్యానర్స్: యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్యరాజా
రచన, దర్శకత్వం: కార్తీక్ భాగ్యరాజా
సంగీతం: కార్తీక్ బి కొడకండ్ల














