Hanuman Ansh Movie: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్‌కు బ్రేక్? త్రివిక్రమ్ తప్పుకున్న తర్వాత అసలు పరిస్థితి ఇదేనా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సైలెంట్‌గా రిలీజై ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకున్న సినిమాల్లో ‘హనుమాన్ అంశ్’ ఒకటి. ఆధ్యాత్మిక నేపథ్యంతో తెరకెక్కిన ఈ డివోషనల్ డ్రామా.. ఎలాంటి భారీ అంచనాలు లేకుండానే బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధించింది.

News18
News18

సైలెంట్‌గా రిలీజై ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకున్న సినిమాల్లో ‘హనుమాన్ అంశ్’ ఒకటి. ఆధ్యాత్మిక నేపథ్యంతో తెరకెక్కిన ఈ డివోషనల్ డ్రామా.. ఎలాంటి భారీ అంచనాలు లేకుండానే బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధించింది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సాధించిన కలెక్షన్లు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుంది. విడుదలైన తర్వాత మౌత్ టాక్‌తో క్రమంగా వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా రూ.350 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ సినిమాలకు సైతం సాధ్యం కాని స్థాయిలో తక్కువ పెట్టుబడితో ఇంతటి వసూళ్లు సాధించడం ‘హనుమాన్ అంశ్’ ప్రత్యేకతగా మారింది.

ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాల్లో ఆధ్యాత్మిక నేపథ్యం, కథలోని భావోద్వేగ అంశాలు, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధానం కీలకంగా నిలిచినట్లు తెలుస్తోంది. సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ పెరగడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ దీనిపై ఆసక్తి మొదలైంది. దీంతో ‘హనుమాన్ అంశ్’ను తెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరిగాయి.

ఈ క్రమంలో మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది. సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు త్రివిక్రమ్ ముందుకు వచ్చారని, తెలుగు వెర్షన్ విడుదలకు సంబంధించిన విషయాన్ని కూడా ప్రకటించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా విడుదలపై ఆసక్తి పెరిగింది.

అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో తెలుగు రిలీజ్ వాయిదా పడింది. అంతేకాకుండా ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన వ్యవహారాల నుంచి త్రివిక్రమ్ కూడా తప్పుకున్నారనే ప్రచారం మొదలైంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో అధికారిక స్పష్టత మాత్రం రాలేదు. దీంతో అప్పటి నుంచి ‘హనుమాన్ అంశ్’ తెలుగు విడుదలపై ఎలాంటి కొత్త అప్‌డేట్ కనిపించలేదు.

తొలుత తెలుగులోనూ ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందని భావించిన ప్రేక్షకులకు తాజా పరిస్థితులు నిరాశ కలిగిస్తున్నాయి. తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా పడిన తర్వాత మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో.. అసలు తెలుగులో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ఉంటుందా? లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రిలీజ్‌పై ఎలాంటి చర్చ లేకపోవడంతో.. థియేటర్లలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓటీటీ ద్వారా అయినా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా అందుబాటులోకి వస్తుందా అనేది చూడాలి. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ‘హనుమాన్ అంశ్’ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. శోబినా సత్య ప్రధాన పాత్రలో నటించారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సాధించిన సంచలన విజయంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తెలుగు రిలీజ్ విషయంలో నెలకొన్న అనిశ్చితికి చిత్రబృందం ఎప్పుడు తెరదించుతుందో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed