Last Updated:
Khairatabad Ganesh Visarjan 2026: గణేష్ చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఓ పక్క తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల భారీ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం డేట్ కూడా ఫిక్సైపోయింది. ఈనెల 23 బుధవారం రాత్రి వరకే భక్తులకు దర్శనాలు చేసుకునేందుకు అనుమతిస్తామని ఉత్సవ కమిటీ ప్రకటించింది.
Khairatabad Ganesh Visarjan 2026: గణేష్ చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఓ పక్క తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల భారీ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో గత 7 దశాబ్దాలుగా పూజలందుకుంటున్న బడా గణేష్ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం డేట్ కూడా ఫిక్సైపోయింది. ఈనెల 23 బుధవారం రాత్రి వరకే భక్తులకు దర్శనాలు చేసుకునేందుకు అనుమతిస్తామని ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఇక 24వ తేది విగ్రహం ఏర్పాటు చేసిన షెడ్డును తొలగించి శోభయాత్ర ద్వారా హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు.
గణపతి ఉత్సవాల్లో బడా గణేష్ పేరుతో ప్రతీ సంవత్సరం హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్‌లో ప్రతిష్టించే అతిపెద్ద గణపతి విగ్రహానికి ప్రత్యేకత ఉంది. 9 రోజుల పాటు విశేష పూజలు, భక్తులకు దర్శనభాగ్యం కల్పించే ఖైరతాబాద్ గణనాథుడు ఈసారి 69 అడుగుల పంచముఖ సంకటహర గణపతిగా ప్రతిష్టించారు. అయితే ఈరోజు అనగా సెప్టెంబర్ 23న ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకునేందుకు చివరి గడువు విధించారు ఉత్సవ కమిటీ సభ్యులు. ఎందుకంటే అతిపెద్ద గణపతి విగ్రహం కావడంతో దీనికి సంబంధించిన నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని..ఎవరికి అసౌకర్యం,ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని హైదరాబాద్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఆదేశాలతో ఈ నెల 25న శుక్రవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు నగరవ్యాప్తంగా నిమజ్జనం జరగనుంది.
ఇక ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనానికి మరికొన్ని గంటలే సమయం ఉన్నందున భక్తులకు బుధవారం రాత్రి వరకే దర్శించుకునేందుకు అకాశం ఉందని ప్రకటించారు. ఇక నిమజ్జనం కోసం 69 అడుగుల పంచముఖ సంకటహర గణపతిని హుస్సేన్‌సాగర్ వద్ద అదనపు క్రేన్లు, అప్‌గ్రేడ్ చేసిన ప్లాట్‌ఫారమ్‌లను సిద్ధం చేస్తున్నారు. 24న ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఏర్పాటు చేసిన షెడ్డు, బ్యారికేడ్లు తొలగిస్తారు. శోభాయాత్ర మార్గం సిద్ధం చేయడం వంటి పనులు 24న చేపట్టనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.
25న ఉదయం నుంచే ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో విగ్రహాన్ని కదిలించి, మధ్యాహ్నం 12 గంటలలోపు శోభాయాత్ర, నిమజ్జన ఘట్టాన్ని పూర్తి చేయాలన్నది ఉత్సవ కమిటీ టార్గెట్. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంతో పాటు సిటీలోని అన్నీ విగ్రహాలు అదే నిమజ్జనం చేయడంతో ఈనెల 25న నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో విగ్రహాలు తరలిరానున్నాయి. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం నగరవ్యాప్తంగా సుమారు 1.5 లక్షల గణేశ్ మండపాలు, దాదాపు 50 లక్షల మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉంది. గణేష్ నిమజ్జనం కోసం అధికారులు, హైదరాబాద్ పోలీసులు ప్రధాన చెరువుగా ఉన్న హుస్సేన్ సాగర్ లేక్‌తో పాటు సరూర్‌నగర్, కాప్రా, అమీన్పూర్, చర్లపల్లి చెరువుతో పాటు 150కి పైగా నిమజ్జన ప్రాంతాలను సెలక్ట్ చేసి అక్కడ తగిన క్రేన్స్ సిద్దం చేశారు.














