Last Updated:
ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? ఎంతో అమాయకంగా, రెండు జడలతో కనిపిస్తున్న ఈ బుడతడి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చూస్తే చిన్ననాటి జ్ఞాపకంగా అనిపిస్తున్నా.. ఈ ఫోటో వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది.
ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? ఎంతో అమాయకంగా, రెండు జడలతో కనిపిస్తున్న ఈ బుడతడి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చూస్తే చిన్ననాటి జ్ఞాపకంగా అనిపిస్తున్నా.. ఈ ఫోటో వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. అసలు ఈ ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరు? ఎందుకు ఇప్పుడు ఈయన ఫోటో అంతలా వైరల్ అవుతుంది.
ఆయన మరెవరో కాదు ది ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా. నాచురల్ స్టార్ నాని హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కాబోతుంది. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈసారి ‘దసరా’ను మించి మరింత గ్రాండ్‌గా, మరింత డిఫరెంట్‌గా సినిమాను తెరకెక్కించేందుకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన టీమ్‌తో కలిసి ఎంతో కష్టపడ్డాడు.
‘ది ప్యారడైజ్’ కోసం శ్రీకాంత్ ఓదెల పూర్తిగా సినిమాకే అంకితమైపోయాడు. షూటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు శ్రీకాంత్. సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా ఆయన అటెండ్ కాలేకపోయాడు. సినిమా రిలీజ్‌కు ముందు కూడా ప్రమోషన్ల కంటే సినిమా పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆయన ఎంతగా ఫోకస్ పెట్టారో అర్థమవుతోంది.
ఇక ‘ది ప్యారడైజ్’లో నాని లుక్ కూడా ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేసింది. ముఖ్యంగా నాని రెండు జడలతో కనిపించడం సినిమాకు సంబంధించిన అత్యంత చర్చనీయాంశమైన అంశాల్లో ఒకటిగా మారింది. హీరోను ఇలాంటి డిఫరెంట్ లుక్‌లో చూపించడం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గతంలోనే చెప్పుకొచ్చారు.
అయితే నాని రెండు జడల లుక్ వెనుక కూడా తన చిన్ననాటి జ్ఞాపకం ఉందని శ్రీకాంత్ ఓదెల వెల్లడించాడు. చిన్నతనంలో తన తల్లి తనకు కూడా జడలు వేసేదని, అదే జ్ఞాపకం ‘ది ప్యారడైజ్’లోని తన పాత్ర రూపకల్పనకు స్ఫూర్తిగా మారిందని తెలిపాడు.
సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ ఉందనగా శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియాలో చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తన చిన్ననాటి జడలతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ, ‘ది ప్యారడైజ్’లో నాని కనిపించే రూపం వెనుక ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు.
తన చిన్నతనంలో ఐదారు సంవత్సరాల వయసు వరకు తన తల్లి జడలు వేసి కట్టేదని శ్రీకాంత్ ఓదెల గుర్తుచేసుకున్నాడు. తాను పెరిగే కొద్దీ తన చిన్ననాటి జ్ఞాపకాలు తన ఆలోచనలను ప్రభావితం చేశాయని, ముఖ్యంగా కమర్షియల్ సినిమాలో 70ఎంఎం తెరపై జడలతో ఒక హీరో ఎలా కనిపిస్తాడో ఊహించుకునేవాడినని చెప్పాడు.
ఇప్పుడు అదే ఆలోచనను ‘ది ప్యారడైజ్’లో నాని రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు శ్రీకాంత్ ఓదెల వెల్లడించాడు. జడలతో నాని కనిపించే లుక్ కేవలం సినిమా కోసం చేసిన ప్రయోగం మాత్రమే కాదని, తన చిన్ననాటి జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న భావోద్వేగం అని చెప్పుకొచ్చాడు.
‘ఈ చిత్రం కేవలం నా చిన్ననాటిది కాదు.. ఇదే నా ప్యారడైజ్’ అంటూ శ్రీకాంత్ ఓదెల చేసిన ఎమోషనల్ వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని లుక్ వెనుక ఇంతటి వ్యక్తిగత కథ ఉందని తెలియడంతో ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు ఈ డిఫరెంట్ లుక్‌తో నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఇక ఫస్ట్ సినిమా దసరాతోనే వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యాడు. ఇక ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమాతో ఏకంగా రూ.200 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పెట్టాడు.














