Startup: మీ అవసరం ఏదైనా? నిమిషాల్లో హెల్పర్‌ను బుక్ చేసుకోండి.. హైదరాబాద్‌ను ఊపేస్తున్న కొత్త యాప్! | బిజినెస్ | ACTPnews

Startup: నిమిషాల్లో  హెల్పర్‌ను బుక్ చేసుకోండి.. హైదరాబాద్‌ను ఊపేస్తున్న కొత్త యాప్


Last Updated:

హైదరాబాద్ స్టార్టప్ అదరగొడుతోంది. నిమిషాల వ్యవధిలో మీరు హెల్పర్లను బుక్ చేసుకోవచ్చు. మీకోసం లేదా మీ పని వీళ్లే చేసిపెడతారు.

Startup: నిమిషాల్లో  హెల్పర్‌ను బుక్ చేసుకోండి.. హైదరాబాద్‌ను ఊపేస్తున్న కొత్త యాప్
Startup: నిమిషాల్లో హెల్పర్‌ను బుక్ చేసుకోండి.. హైదరాబాద్‌ను ఊపేస్తున్న కొత్త యాప్

ఉరుకులు పరుగుల యాంత్రిక జీవితంలో చిన్నచిన్న పనులు చేసుకోవడానికి కూడా నేడు సమయం దొరకడం లేదు. ఆఫీసు పనుల బిజీలో పడి క్యూ లైన్‌లో నిల్చోవాలన్నా, ఇంట్లో వృద్ధులకు సాయం చేయాలన్నా మనిషి అవసరం ఎంతో ఏర్పడుతోంది. సరిగ్గా ఈ నగర సమస్యకే అద్భుతమైన పరిష్కారం చూపుతున్నారు యువ పారిశ్రామికవేత్తలు హర్షవర్ధన్, సూర్యప్రకాశ్. వీరు కేవలం రెండు నెలల కిందట హైదరాబాద్‌లో ‘నోడీ’ (Noddyy) అనే వినూత్న స్టార్టప్‌ను ప్రారంభించారు. మనకు కావాల్సిన పనులను చేసిపెట్టే నమ్మకమైన సహాయకులను ఈ మొబైల్ యాప్ ద్వారా చాలా సులభంగా బుక్ చేసుకోవచ్చు.

నోడీ స్టార్టప్ ఫౌండర్లలో ఒకరైన హర్షవర్షన్.. న్యూస్18 ప్రతినిధి మస్తాన్ వలీతో ఫోన్ కాల్ ద్వారా పలు అంశాలను వెల్లడించారు. నోడీ యాప్ ద్వారా రోజువారీ జీవితంలో రకరకాల సేవలు పొందవచ్చు. లోకల్ టెంపుల్ నుంచి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తెప్పించుకోవడం, హాస్పిటల్‌లో పేషెంట్ల పక్కన ఉండటం, మెడికల్ షాపుల నుంచి మందులు తేవడం లాంటి పనులు ఎన్నో చేస్తారు. అంతేకాకుండా సీనియర్ సిటిజన్లకు సాయం చేయడం, చిన్న పిల్లలను చూసుకోవడం, గణపతి నిమజ్జనం, పెళ్లిళ్లలో ఫోటోగ్రఫీ పనులు, ఎల్ఐసీ పేమెంట్లు కట్టడం, ఓల్డేజ్ హోమ్‌లో ఒక రూమ్ నుంచి మరో రూమ్‌కు సామాన్లు మార్చడం, షాపు పనుల్లో సాయం చేయడం, ఆఫీసుల్లో డాక్యుమెంట్లు సమర్పించడానికి వీరు సిద్ధంగా ఉంటారు. గంటకు రూ.149 చెల్లిస్తే చాలు.. అవసరాన్ని బట్టి బైక్, కారు, ఆటో బుకింగ్ సదుపాయాలతో వీరు తమ సేవలు అందిస్తారు.

ఇది కూడా చదవండి: Bank Strike: బ్యాంక్ కస్టమర్లకు భారీ ఊరట.. ఆర్‌బీఐ సంచలనం, ఆదివారం పని చేయనున్న బ్యాంకులు!

ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితమైన ఈ యాప్ సేవలను విదేశాల్లో ఉన్నవారు సైతం విరివిగా వినియోగించుకుంటున్నారు. ఫారిన్‌లో ఉండే వారు ఇక్కడ ఉన్న తమ బంధువుల కోసం సులభంగా సర్వీస్ బుక్ చేస్తున్నారు. ఉదాహరణకు కెనడాలో ఉండే ఒక కస్టమర్ తల్లిదండ్రులు ఇక్కడ కొత్తగా షాపు పెట్టారు. ఆ షాపులో కస్టమర్ల రద్దీ పెరగడంతో, అమ్మానాన్నలకు సాయంగా నోడీ యాప్ ద్వారా ఒకేసారి ముగ్గురు హెల్పర్లను బుక్ చేశారు. అమెరికాలో ఉండే మరో వ్యక్తి తన ఖాళీ స్థలంలో సీసీ టీవీ కెమెరాలు బిగించడానికి యాప్ ద్వారా ఒక వ్యక్తిని రప్పించుకున్నారు. ఇక్కడి పనుల కోసం ప్రతిరోజూ యాప్ ద్వారా సగటున 50 ఆర్డర్లు వస్తుండటం విశేషం.

ఇది కూడా చదవండి: Sleep Deprivation: స్మార్ట్‌ఫోన్ చూస్తూ నిద్రపోతున్నారా? అయితే మీరు ఆ భయంకరమైన వ్యాధులను కొనితెచ్చుకుంటున్నట్లే!

కొత్త వ్యక్తులను నమ్మి పనులు అప్పగించే విషయంలో నోడీ స్టార్టప్ పక్కా భద్రతా ప్రమాణాలు పాటిస్తోంది. కేవలం ఆరుగురు సభ్యుల బృందంతో నడుస్తున్న ఈ సంస్థ కఠినమైన వెరిఫికేషన్ విధానాన్ని అమలు చేస్తోంది. హెల్పర్‌గా చేరాలనుకునే వారు ముందుగా ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ లాంటి కీలక డాక్యుమెంట్లు సమర్పించాలి. అదనంగా ఇద్దరు కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్లను సైతం తీసుకుని ధ్రువీకరిస్తారు. పోలీస్ వెరిఫికేషన్ చేయించుకున్న వారికి సంస్థ మరింత ప్రాధాన్యత ఇస్తుంది. ఇలా పోలీస్ వెరిఫై అయిన వారికి గంటకు రూ.149కి బదులుగా రూ.180 చెల్లిస్తూ ప్రోత్సహిస్తున్నారు.

ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఈ యాప్‌కు నగరవాసుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కేవలం రెండు నెలల్లోనే 5,700 మంది యూజర్లు దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. సుమారు 10 వేల మంది హెల్పర్లుగా రిజిస్టర్ చేసుకోగా, అన్ని కఠిన ధ్రువీకరణలు పూర్తి చేసుకున్న 1,000 మందికి మాత్రమే సంస్థ అప్రూవల్ ఇచ్చింది. రూ.50 లక్షల ప్రాజెక్టుగా ముందుకు సాగుతున్న ఈ సంస్థ, పారదర్శకమైన ఆదాయ విధానాన్ని ఎంచుకుంది. రానున్న రోజుల్లో బెంగళూరు, ఢిల్లీ, చెన్నై వంటి ఇతర నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed