Tollywood: డైరెక్టర్ రవిచంద్ర సినిమాల లిస్ట్ తీస్తే షాక్ అవ్వాల్సిందే.. సూపర్ స్టార్ కృష్ణ నుంచి బాలయ్య, వెంకీమామలతో రికార్డులు తిరగరాశాడు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ దర్శకుడు ఎస్‌ఎస్‌ రవిచంద్ర (84) కన్నుమూశారు. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచాడు.

News18
News18

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ దర్శకుడు ఎస్‌ఎస్‌ రవిచంద్ర (84) కన్నుమూశారు. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచాడు. ఆయన ఎలా చనిపోయారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఆయన మృతితో సినీ వర్గాల్లో విషాదం నెలకొంది.

ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లు ఆయన స్వగ్రామం. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత పలువురు అగ్ర హీరోలతో కలిసి ఆయన పనిచేశారు. ముఖ్యంగా సూపర్‌స్టార్ కృష్ణతో పలు సినిమాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కృష్ణ హీరోగా ‘రౌడీ నంబర్ వన్’, ‘కిరాయి గూండా’, ‘సార్వభౌముడు’ వంటి సినిమాలను తెరకెక్కించారు. అదే టైమ్‌లో నందమూరి బాలకృష్ణతోనూ ఎస్‌ఎస్‌ రవిచంద్ర పలు సినిమాలు రూపొందించారు. బాలకృష్ణ హీరోగా ‘దేశోద్ధారకుడు’, ‘అశోక చక్రవర్తి’ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. విక్టరీ వెంకటేశ్‌తో ‘అగ్గిరాముడు’, ‘విజేత విక్రమ్’ వంటి సినిమాలు తెరకెక్కించారు.

తెలుగులోనే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమలోనూ ఎస్‌ఎస్‌ రవిచంద్ర తనదైన ముద్ర వేశారు. బాలీవుడ్ స్టార్ జితేంద్ర హీరోగా ‘ఖైదీ’ సినిమాను తెరకెక్కించారు. అలాగే సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో ‘మహాగురు’ సినిమాను రూపొందించారు. ఇలా దక్షిణాది అగ్ర హీరోలతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ పనిచేసిన దర్శకుడిగా ఆయన కెరీర్ కొనసాగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed