PM Modi: దేశాభివృద్ధికి యువ శక్తి అవసరం.. ఆ ఒక్కటి పాటిస్తే యువతకు తిరుగు ఉండదు.. | | ACTPnews

News18


Last Updated:

సేవా సంకల్ప యాత్రలో యువతతో ప్రధాని మోదీ వర్చువల్‌ సంభాషణ నిర్వహించారు. 2047 నాటికి వికసిత భారత్‌ నిర్మాణంలో యువత పాత్రపై ఆయన కీలక సూచనలు చేశారు. ఇంతకీ యాత్రికులకు మోదీ ఏ సందేశం ఇచ్చారు?

మోదీ
మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 24న సేవా సంకల్ప యాత్రలో పాల్గొంటున్న వారితో వర్చువల్‌గా సంభాషించారు. గుజరాత్‌లోని వడనగర్‌ నుంచి వారాణసీ వరకు కొనసాగుతున్న ఈ బైక్‌ యాత్రను ఆయన క్షేత్రస్థాయిలో దేశ నిర్మాణంతో ముడిపడిన కార్యక్రమంగా అభివర్ణించారు. వాతావరణ పరిస్థితులు, తరచూ మారుతున్న ప్రాంతాలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే యాత్రలో పాల్గొంటున్నవారు ముందుకు సాగుతున్నారని తెలిపారు.

సంభాషణ సందర్భంగా సేవా భావంతో కొనసాగుతున్న వివిధ కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. రాజకీయాలు, ఎన్నికలు, పాలనా వ్యవస్థకు వాటి ప్రాధాన్యత వాటికే ఉన్నప్పటికీ.. దేశ నిర్మాణం కోసం క్షేత్రస్థాయిలో పనిచేయడం ఎంతో అవసరమని అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్యాన్ని సాధించడంలో యువత పాత్ర కీలకమని మోదీ పేర్కొన్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాలను, సమాజంలోని భిన్న వర్గాలను, వారి ఆకాంక్షలను, ఆలోచనా విధానాలను యువత దగ్గరగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోవడం ద్వారా దేశ నిర్మాణంలో యువత మరింత సమర్థవంతంగా భాగస్వాములు కావచ్చని ఆయన పేర్కొన్నారు.

వడనగర్‌, వారాణసీ రెండు పురాతన, చారిత్రక నగరాలని ప్రధాని మోదీ అన్నారు. వడనగర్‌ తన జన్మస్థలమని, వారాణసీ తన కర్మభూమి అని ఆయన పేర్కొన్నారు. సేవా సంకల్ప యాత్రలో భాగమైన యువత చేపడుతున్న సేవా కార్యక్రమాలను కూడా మోదీ ప్రశంసించారు.

కాగా, సేవా సంకల్ప యాత్ర సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 7 వరకు మొత్తం 10 బృందాలతో కొనసాగుతోంది. ఈ యాత్రలో గ్రామసభలతో సంభాషణలు, పరిశుభ్రత కార్యక్రమాలు, మొక్కలు నాటడం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశాలు, యువతతో చర్చలు, వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ సేవా భావాన్ని పెంపొందించడం, దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఈ యాత్రలోని ప్రధాన కార్యక్రమాలుగా కొనసాగుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports