ఒంటిపై 6.3 కిలోల బంగారం.. కారు, బుల్లెట్ మొత్తం గోల్డే.. ఈ గోల్డ్ మ్యాన్ స్టోరీ మామూలుగా లేదు..! bihar-gold-man-car-bike-and-full. | | ACTPnews

News18


Last Updated:

బీహార్‌లోని ప్రేమ్ సింగ్, ‘గోల్డ్ మ్యాన్’గా ప్రసిద్ధి చెందారు. రూ.75 లక్షల కారుకు రూ.3 లక్షలతో గోల్డ్ కలర్ కోటింగ్ ఇచ్చారు. 6.3 కిలోల బంగారం, గోల్డెన్ బుల్లెట్ బైక్ ధరిస్తారు. వ్యవసాయం, ప్రభుత్వ కాంట్

News18
News18

పాట్నా వీధుల్లో ఓ కారు వెళ్తుంటే.. చుట్టూ ఉన్నవారి చూపు ఆటోమేటిక్‌గా దానిపైనే పడుతుంది. మామూలు కారు లాగే కనిపించినా.. దాని మెరుపు మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. కారు దగ్గరికి వెళ్లి చూస్తే గోల్డెన్ లుక్‌తో మెరిసిపోతుంది. అసలు ఆ కారు ఎవరిది.. దాని వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకుంటే మాత్రం కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఆయనే బీహార్‌కు చెందిన గోల్డ్ మ్యాన్ ప్రేమ్ సింగ్.

ప్రేమ్ సింగ్ ముంబై నుంచి కొనుగోలు చేసిన సుమారు రూ.75 లక్షల విలువైన కారుకు గోల్డెన్ లుక్ ఇచ్చారు. ఇందుకోసం దాదాపు రూ.3 లక్షలు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ కారుపై ఉన్నది నిజమైన బంగారం కాదని.. గోల్డ్ కలర్ కోటింగ్‌తో గోల్డెన్ లుక్ తీసుకొచ్చినట్లు చెప్పారు. భవిష్యత్తులో నిజాయితీగా సంపాదించిన డబ్బుతో కారులో నిజమైన బంగారాన్ని కూడా ఉపయోగించాలన్నది తన కోరిక అని ప్రేమ్ సింగ్ చెబుతున్నారు.

ప్రేమ్ సింగ్‌కు బంగారంపై ఉన్న ఇష్టం కారుతోనే ఆగిపోలేదు. ఆయన స్వయంగా సుమారు 6 కిలోల 300 గ్రాముల బంగారం ధరిస్తున్నట్లు చెబుతున్నారు. గొలుసులు, కంకణాలు, ఉంగరాలు ఇలా మొత్తం 63 ఆభరణాలు తన దగ్గర ఉన్నాయని తెలిపారు. బయటకు వెళ్లిన ప్రతిసారి ఈ భారీ ఆభరణాలతో కనిపించడం ఆయన ప్రత్యేక గుర్తింపుగా మారిపోయింది. అందుకే స్థానికంగా ఆయనను గోల్డ్ మ్యాన్ ఆఫ్ బీహార్ అని పిలుస్తుంటారు.

ఇక ప్రేమ్ సింగ్ దగ్గర ఉన్న మరో ప్రత్యేకమైన వస్తువు ఆయన బుల్లెట్ బైక్. ఈ బైక్‌కు కూడా గోల్డెన్ లుక్ ఇచ్చారు. బైక్‌పై సుమారు 200 నుంచి 300 గ్రాముల వరకు బంగారాన్ని ఉపయోగించినట్లు ఆయన చెబుతున్నారు. దాని విలువ సుమారు రూ.13 నుంచి రూ.14 లక్షల వరకు ఉంటుందని సమాచారం. దీంతో రోడ్డుపై ప్రేమ్ సింగ్ బుల్లెట్‌పై వెళ్తున్నప్పుడు కూడా ప్రజల దృష్టి ఆయనపైనే పడుతుంది.

ప్రేమ్ సింగ్‌కు బంగారంపై ఉన్న ప్రేమ ఇప్పటిది కాదు. చిన్న బంగారు గొలుసుతో మొదలైన ఈ ప్రయాణం.. క్రమంగా భారీ ఆభరణాల వరకు వెళ్లింది. ప్రజల్లో తనకు ప్రత్యేక గుర్తింపు రావడంతో బంగారం కూడా తన జీవితంలో ఒక భాగంగా మారిందని ఆయన చెబుతున్నారు. తనకు ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదని.. బీహార్‌లో తన గౌరవం, ప్రతిష్టకు సంబంధించిన గుర్తింపు అని అంటున్నారు.

ఇంత బంగారం కొంటూ, ఇంత ఖర్చు ఎలా చేస్తున్నారనే ప్రశ్న కూడా చాలామందికి వస్తుంది. దీనిపై ప్రేమ్ సింగ్ మాట్లాడుతూ తాను భూస్వామి కుటుంబానికి చెందినవాడినని, వ్యవసాయం చేస్తానని చెప్పారు. దీంతో పాటు ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా కూడా ఆదాయం వస్తుందని తెలిపారు. తన సంపాదనలో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు కేటాయిస్తానని.. అందుకే కాలక్రమేణా తన దగ్గరున్న బంగారం కూడా పెరుగుతోందని వివరించారు.

ఇక ఇన్ని బంగారు ఆభరణాలను ధరించి బయటకు వెళ్లడం కూడా అంత సులభం కాదంటున్నారు ప్రేమ్ సింగ్. తాను ప్రతిరోజూ ఏదో ఒక కార్యక్రమానికి లేదా ఆహ్వానానికి వెళ్తుంటానని.. అందుకే ప్రతిరోజూ ప్రత్యేకంగా రెడీ అవ్వాల్సి వస్తుందని చెప్పారు. ఈ స్టైల్‌ను కొనసాగించడానికి నెలకు సుమారు రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. పెద్ద మీసాలు, ఒంటినిండా బంగారం, గోల్డెన్ కారు, గోల్డ్ బుల్లెట్‌తో కనిపించే ప్రేమ్ సింగ్.. ఇప్పుడు బీహార్‌లో తనదైన ప్రత్యేక గుర్తింపుతో గోల్డ్ మ్యాన్ గా మారిపోయారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports