Nani The Paradise: ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమాకెళ్తున్నా.. ది ప్యారడైజ్‌పై కేటీఆర్ ట్వీట్ వైరల్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

చాలా ఏళ్ల తర్వాత ఈరోజు రాత్రి థియేటర్‌లో సినిమా చూడాలనుకుంటున్నా.. అంటూ ది ప్యారడైజ్ సినిమాపై, నానిపై కామెంట్స్ చేస్తూ పోస్ట్ పెట్టారు కేటీఆర్.

News18
News18

నేచురల్ స్టార్ నాని, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి ఆట నుంచే మిశ్రమ స్పందనలు వ్యక్తమైనప్పటికీ, వసూళ్లలో మాత్రం ఈ చిత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా బి, సి సెంటర్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాస్ ప్రేక్షకుల నుంచి ఈ యాక్షన్ హంగామాకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో సైతం ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

తాజాగా ఈ సినిమా క్రేజ్ రాజకీయ వర్గాలకు కూడా పాకింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ చిత్రాన్ని శనివారం రాత్రి థియేటర్‌లో వీక్షించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ.. “చాలా ఏళ్ల తర్వాత ఈరోజు రాత్రి థియేటర్‌లో సినిమా చూడాలనుకుంటున్నాను. నా అభిమాన నటుడు నాని, ఎంతో ప్రతిభావంతుడైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలిసి తీసిన ‘ది ప్యారడైజ్’ చూడబోతున్నా” అని పోస్ట్ చేశారు. అయితే కేటీఆర్ ఈ సినిమా చూడటం వెనుక ఒక ఆసక్తికరమైన అంశం దాగి ఉంది. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి.. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన ‘ఎమ్మెల్యే శంకర్’ పాత్రను పోషించారు. సవారీ తెగకు, శంకర్ పాత్రకు మధ్య వచ్చే పవర్‌ఫుల్ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్వయంగా ఈ సినిమాను వీక్షించడం విశేషంగా మారింది.

బాక్సాఫీస్ వసూళ్ల విషయానికి వస్తే, ‘ది ప్యారడైజ్’ నాని కెరీర్‌లోనే సరికొత్త రికార్డులను లిఖిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.114 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నాని కెరీర్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న చిత్రంగా ఇది నిలిచింది. దీనికి తోడు బుక్‌ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌ల ద్వారా ఇప్పటికే 2.5 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడవడం సినిమాపై ఉన్న బజ్ స్థాయిని తెలియజేస్తోంది.

గతంలో ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మరోసారి ప్రాజెక్ట్ చేయడం వెనుక ఉన్న కారణాన్ని నాని తాజాగా పంచుకున్నారు. అద్భుతమైన విజువల్స్, బలమైన భావోద్వేగాలతో కూడిన భారీ కమర్షియల్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. “శ్రీకాంత్ ఓదెల అద్భుతమైన మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాను ఇవ్వగలడన్న పూర్తి నమ్మకం నాకుంది. రోజూ చూసే సినిమాలకు భిన్నంగా ఓ ఉత్సాహభరితమైన కథను చెప్పాలనుకున్నాం. అయితే, నిజ జీవితంలో నేను ఈ సినిమాలో చేసిన ‘జడల్’ పాత్రలా అస్సలు ఉండను. నా గత చిత్రం ‘సరిపోదా శనివారం’లోని సూర్య పాత్రకు కొంత దగ్గరగా ఉంటాను. అలాగని నాకు కేవలం శనివారం మాత్రమే కోపం వస్తుందని కాదు” అంటూ నాని సరదాగా వ్యాఖ్యానించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports