ఒకవేళ ఈ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, జరిమానాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు 2025లో జరిగిన ఓ మ్యాచ్లో ‘ఈస్టర్న్ ప్రావిన్స్ వారియర్స్’ జట్టు ఈ ట్రాన్స్ఫర్మేషన్ నిబంధనను పాటించకపోవడంతో ఆ జట్టు సాధించిన పాయింట్లను తొలగించడమే కాకుండా 5,00,000 ర్యాండ్ల (R500,000) భారీ జరిమానా విధించారు. నల్లజాతి ఆటగాళ్లకు, ముఖ్యంగా బ్లాక్ ఆఫ్రికన్ క్రికెటర్లకు అవకాశాలు పెంచి భవిష్యత్తులో పెద్ద స్థాయిలో ఆడగల సత్తా ఉన్న ఆటగాళ్ల సంఖ్యను పెంచడమే ఈ లక్ష్యాల ప్రధాన ఉద్దేశమని సీఎస్ఏ చెబుతోంది.














