PM Modi: భారత్ వైపు కన్నెత్తి చూస్తే అంతుచూస్తాం.. సర్జికల్ స్ట్రైక్స్‌కు 10 ఏళ్ల వేళ ఉగ్రవాదులకు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్! | | ACTPnews

ఎన్డీయే కొత్త ఎంపీలతో నేడు ప్రధాని మోదీ భేటీ (Image credit - PTI)


Last Updated:

చారిత్రాత్మక 2016 సర్జికల్ స్ట్రైక్స్‌కు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత సైనిక శౌర్యాన్ని కొనియాడారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానం పాటిస్తోందని, దేశం వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ‘మన్ కీ బాత్’లో హెచ్చరించారు.

News18
News18

ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న నూతన పోరాట విధానాన్ని 2016 నాటి సర్జికల్ స్ట్రైక్స్ ప్రపంచానికి చాటిచెప్పాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం (సెప్టెంబర్ 27) నిర్వహించిన తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 138వ ఎపిసోడ్‌లో ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచిన సర్జికల్ స్ట్రైక్స్‌కు సోమవారంతో పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సైనికుల సాహసాన్ని ప్రధాని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. సరిగ్గా దశాబ్దం క్రితం 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత వీర జవాన్లు నియంత్రణ రేఖ (LIC) దాటి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తీరు చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయిందని తెలిపారు.

యూరీ ఆర్మీ బేస్‌పై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ మెరుపు దాడులు.. దశాబ్దాలుగా ఉగ్రవాద దాడుల వల్ల భారత్ అనుభవించిన తీవ్ర ఆవేదనకు ధీటైన సమాధానమని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ ‘జీరో టాలరెన్స్’ (సహించేది లేదనే) విధానాన్ని పాటిస్తోందని, ఉగ్ర చర్యలకు కఠిన రీతిలో బదులిస్తామని తేల్చిచెప్పారు.

బాలాకోట్ నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు..

గత దశాబ్ద కాలంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ వరుసగా బుద్ధి చెబుతూనే ఉందని ప్రధాని మోదీ అన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్ మొదలుకొని 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, ఇటీవల చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వరకు భారత్ ఒకే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని తెలిపారు. ఉగ్రవాదులు గనుక భారత్ వైపు వక్రదృష్టితో చూసే సాహసం చేస్తే వారికి ఊహించని రీతిలో తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు.

గత ప్రభుత్వాల తీరును ప్రస్తావిస్తూ.. ఒకప్పుడు దేశంలో వరుస బాంబు పేలుళ్లు నిత్యకృత్యంగా ఉండేవని, 2008 ఢిల్లీ వరుస పేలుళ్లు, 26/11 ముంబై దాడుల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని మోదీ గుర్తుచేశారు. అప్పట్లో ఉగ్రదాడి జరిగినప్పుడల్లా పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చినా నాటి పాలకులు పట్టించుకోకుండా కాలం గడిపేవారని విమర్శించారు. కానీ నేటి నవ భారతం మాత్రం ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేలా ముందుకు సాగుతోందని, దాని ఫలితాలు కళ్లముందే కనిపిస్తున్నాయని చెప్పారు.

ఇదే కార్యక్రమంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనపై ప్రధాని మాట్లాడుతూ.. మొదటి దశలో ఇప్పటికే 32 కోట్లకు పైగా కుటుంబాల వివరాలు నమోదయ్యాయని, 2.6 కోట్ల మంది ఆన్‌లైన్‌లో స్వయంగా వివరాలు నమోదు చేసుకున్నారని తెలిపారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో పురాతన మెట్ల బావులను పునరుద్ధరిస్తున్న యువతను ప్రశంసించారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండేలా ‘నశా ముక్త్ యువ అభియాన్’లో భాగస్వాములు కావాలని కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed