Flydubai Flight: గాల్లో విమానం.. పొట్టు పొట్టు కొట్టుకున్న పైలట్లు.. ఒక్కసారిగా కిందకు ప్లైట్.. | | ACTPnews

Flydubai FZ1073 Plane Incident Pilot Stabbing Mid Air


Last Updated:

గాల్లో ప్రయాణిస్తున్న విమానం.. కాక్‌పిట్‌లో ఒక్కసారిగా అరుపులు.. ఆ తర్వాత కనిపించిన రక్తపు మరకలు.. అసలు అక్కడ ఏం జరిగింది? దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో పైలట్ల మధ్య జరిగిన ఘటనతో 180 మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Flydubai FZ1073 Plane Incident Pilot Stabbing Mid Air
Flydubai FZ1073 Plane Incident Pilot Stabbing Mid Air

దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానం FZ1073లో సెప్టెంబర్‌ 30న తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య హింసాత్మక ఘటన జరిగింది. కో-పైలట్‌ కత్తితో మరో పైలట్‌పై దాడి చేసినట్లు ప్రయాణికులు వెల్లడించారు. ఘటన తర్వాత విమానం అత్యవసర సంకేతాలు పంపి సౌదీ అరేబియాలోని తాబుక్‌ విమానాశ్రయానికి మళ్లి సురక్షితంగా ల్యాండ్‌ అయింది. విమానంలో సుమారు 180 మంది ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.

కో-పైలట్‌ జాతీయతపై దర్యాప్తు

ఇజ్రాయెల్‌ అధికారులు, మీడియా కథనాల ప్రకారం దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కో-పైలట్‌ ఒమన్‌ జాతీయుడిగా గుర్తించారు. మరో పైలట్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందినవాడని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి. ఇజ్రాయెల్‌ అధికారులు ఇది ఉద్దేశపూర్వక చర్య అయి ఉండొచ్చనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. కో-పైలట్‌కు ఇజ్రాయెల్‌ వెళ్లే విమానంలో పనిచేసేందుకు అనుమతి ఎలా లభించిందన్న అంశంపైనా పరిశీలన జరుగుతోంది.

కాక్‌పిట్‌లో రక్తపు మరకలు

విమానం దుబాయ్‌ నుంచి బయలుదేరిన కొంతసేపటి తర్వాత కాక్‌పిట్‌ నుంచి అరుపులు వినిపించాయని ప్రయాణికులు తెలిపారు. ఒక ప్రయాణికురాలు కాక్‌పిట్‌ వద్దకు వెళ్లి రక్తం కనిపించడంతో సహాయం కోసం కేకలు వేసినట్లు చెప్పింది. దీంతో కొందరు ప్రయాణికులు, విమాన సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. మరో ప్రయాణికుడి కథనం ప్రకారం, విమానం ఒక్కసారిగా వేగంగా కిందకు దిగడం ప్రారంభించడంతో ముందు వరుసల్లో ఉన్న కొందరు ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి వెళ్లి పైలట్లకు సహాయం చేశారు.

ఆఫ్‌డ్యూటీ పైలట్లు రంగంలోకి

విమానంలో ఆఫ్‌డ్యూటీలో ఉన్న మరో ఇద్దరు పైలట్లు కూడా పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దాడి చేసిన వ్యక్తిని కాక్‌పిట్‌ నుంచి బయటకు తీసుకొచ్చిన అనంతరం వారిలో ఒకరు విమాన నియంత్రణ బాధ్యతలు చేపట్టినట్లు ప్రయాణికులు తెలిపారు. అత్యవసర పరిస్థితి కారణంగా విమానం ఇజ్రాయెల్‌కు వెళ్లకుండా సౌదీ అరేబియాలోని తాబుక్‌కు మళ్లింది. తాబుక్‌ విమానాశ్రయానికి అత్యవసర ల్యాండింగ్‌ అభ్యర్థన అందడంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇద్దరు పైలట్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

భారతీయ కెప్టెన్‌పై నివేదికలు

ఈ ఘటనలో కెప్టెన్‌ భారతీయుడని కొన్ని ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే పైలట్ల జాతీయతపై వివిధ మీడియా సంస్థల్లో భిన్నమైన వివరాలు వెలువడుతున్నాయి. అందువల్ల భారతీయ కెప్టెన్‌ అంశాన్ని కూడా ప్రస్తుతానికి నివేదికల ఆధారంగానే చూడాల్సి ఉంటుంది. ఇదే సమయంలో గాయపడిన పైలట్‌కు విమానంలో ప్రయాణిస్తున్న ఒక ఇజ్రాయెల్‌ దంత వైద్యుడు ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు సహకరించినట్లు ప్రయాణికులు తెలిపారు.

ఉగ్రకుట్ర కోణంలోనూ విచారణ

కాక్‌పిట్‌లో జరిగిన ఘటన అనంతరం విమానం అత్యవసర సంకేతాలు పంపింది. అందులో అక్రమ జోక్యానికి సంబంధించిన సంకేతం కూడా ఉండటంతో హైజాక్‌ అనుమానాలు తలెత్తాయి. విమానం భారీగా కిందకు దిగినట్లు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వివరాలు సూచించాయి. అయితే ఘటనకు అసలు కారణం ఏమిటి, దాడి వెనుక ఉద్దేశం ఏంటి అనే అంశాలు ఇంకా దర్యాప్తులో ఉన్నాయి. ఫ్లైదుబాయ్‌ మాత్రం విమానంలో ఘటన చోటుచేసుకున్నట్లు ధృవీకరించి, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed