కేసీఆర్ పాలనలో సిరిసిల్ల ఉరిసిల్ల అయ్యిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తండ్రికొడుకులిద్దరు కలిసి కాళేశ్వరం పేరుతో లక్షలకోట్లు దోచుకున్నారని విమర్శించారు. పాలమూరులో కేసీఆర్‌ను గెలిపించినా ప్రయోజనం లేదన్నారు. వేములవాడకు ఇస్తానన్న వంద కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. సిరిసిల్లపై గురిపెడతా అన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ గడీని కూల్చేస్తామన్నారు.
సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. సభా వేదిక వరకు భారీ ర్యాలీగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ప్రజలు అడుగడుగునా సీఎంకు బ్రహ్మరథం పట్టారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి సిరిసిల్ల పాత బస్టాండ్ నేతన్న విగ్రహం మీదుగా రగుడు బైపాస్ వద్ద బహిరంగ సభ వరకు సీఎం రేవంత్ పాదయాత్ర నిర్వహించారు.
పల్లె పండుగ గ్రాండ్ సక్సెస్ అవుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రూ.11 వేల కోట్లకుపైగా అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ జెట్ స్పీడ్‌తో ముందుకెళ్తుందన్నారు. తన అనుభవం, పవన్ హుషారు, కేంద్రం సహకారంతో ముందుకెళ్తున్నామన్నారు ముఖ్యమంత్రి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామన్నారు. గత ప్రభుత్వం విధ్వంసం చేసింది, రోడ్డు దారుణంగా ఉండేవని వైసీపీపై మండిపడ్డారు.. సీఎం చంద్రబాబు.
ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. కిలో ఉల్లి ధర.. 50 నుంచి 60 రూపాయల వరకు ఉంది. ఉల్లి ధర పెరగడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ కింద కిలో ఉల్లి రూ.35లకు అందిస్తుంది. ఇవాళ్టి నుంచి అన్ని రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లి అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఢిల్లీ వేదికగా ఒకేతాటిపైకి ప్రతిపక్ష నేతలు..కాన్‌స్టిట్యూషన్ క్లబ్ భవనంలో ఇండియా కూటమి కీలక సమావేశం నిర్వహించింది. అక్టోబర్ 2 నుంచి 8 వరకు సేవ్ డెమొక్రసీ మార్చ్..నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో మార్చ్ నిర్వహించనున్నారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. అక్టోబర్ 2వ వారంలో రాష్ట్రపతిని కలుస్తామన్నారు. ఈసీని నరేంద్ర మోడీ, అమిత్ షా తోలుబొమ్మలా వాడుతున్నారని విమర్శించారు ఖర్గే. అందుకే ఎన్నికల్లో వరుసగా గెలుస్తారని విమర్శించారు. అక్టోబర్ 6న సీఈసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని.. ఎంపీలంతా కలిసి సీఈసీ ఆఫీసును ముట్టడిస్తామన్నారు ఖర్గే.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. అక్టోబర్ 3న రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మరుసటి రోజు మెదక్ తూప్రాన్‌లోని ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌లో డెయిరీ మిల్క్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత కరీంనగర్‌లోని ఓ కాలేజ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. సాయంత్రం ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. ఫెడరేషన్ నిర్ణయాలను సభ్యసంఘాలు, నాయకులు పాటించాలని సూచించారు. జానీమాస్టర్‌పై సహాయ నిరాకరణ కొనసాగించాలని అనుబంధ సంఘాలకు ఆదేశాలు జారీ చేశారు.
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’ . ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రీబిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసమే ఏకంగా ₹270 కోట్లకు పైగా పలికే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. పుష్ప- 2, RRR రికార్డులను వెనక్కి నెడుతుందని అంచనా వేశాయి. అయితే దసరా తర్వాత దీనిపై స్పష్టత రానుంది.
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఘటనలో సంచలన విషయం బయటికొచ్చింది. ఒమన్‌కు చెందిన కో-పైలట్ ఫ్లైట్‌లో తనపై కత్తితో దాడి చేయగా ఇండియాకు చెందిన పైలట్ ధైర్యంగా ఫైట్ చేశారని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. టెర్రర్ అటాక్‌ను అడ్డుకున్నారని, విమానంలోని 180 మంది ప్రాణాలను రక్షించారని ప్రశంసించింది. గాయపడిన పైలట్ సౌదీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.
ట్రంప్‌తో టెక్ దిగ్గజాల కీలక సమావేశం నిర్వహించారు. సూపర్ ఇంటెలిజెన్స్‌పై ట్రంప్‌తో టెక్ దిగ్గజాల చర్చించారు. వైట్‌హౌస్‌లో ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ఏఐ అకార్డ్’ను ఆవిష్కరించారు. దీంతో ఏఐని అదుపులో పెట్టే నైతిక బాధ్యతను అగ్రశ్రేణి టెక్ కంపెనీలు స్వచ్ఛందంగా తీసుకున్నట్లయింది. ఏఐ సాంకేతికత అభివృద్ధిని అమెరికా ప్రభుత్వం నియంత్రించదని, అడ్డుకోదని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. ఈ రంగాన్ని ‘‘సూపర్ ఇంటెలిజెన్స్’’ అని పిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg), జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ (Elon Musk) తదితరులు పాల్గొన్నారు.













